Friday, April 10, 2015

  • నాకూ కవిత్వం రాయటం వస్తే నా అనుభవాలు కవితలైతే పచ్చని చీరలో సింధూర భానునికై ఎదురుచూసే పర్వత శ్రేణుల గురించి వేకువ ఝాము మౌనం మూట కట్టుకుని ఈ నిశి రాత్రి వెలుగు కౌగిలిలొ కరిగి పొవటం గురించి ఒక్కో గడ్డిపరక తుషార బిందువుని వయ్యారం గా ప్రహారా సైనికుని తుటాలా మొయ్యటం గురించి ఆకాశం హరివిల్లు రంగులద్దుకుని ఆ ప్రశాంత సరస్సుల అద్దాలలో ప్రతిబింబాలను ప్రతిఫలించటం గురించి అమాయకంగా మిణుకు మిణుకు వీధి దీపాలు నగరానికి వెలుగునిస్తూ, ఆ సూర్య చంద్రుల ఉనికిని మరిపించటం గురించి పక్షుల గానామ్రుతం ఆ శ్రీవారి సుప్రభాతం లా తెలవారటం గురించి వయస్సు, ఆస్తి, అంతస్తుల , స్త్రీ పురుష భేధం లేకుండా వణికించే చలిలో, పర్వతారోహణం చెసె ప్రతి మదిలో హ్రుదిలో కనపడని ప్రేమ గురించి ఆ ప్రేమని పంచే శ్రుష్ఠి కర్త ప్రాణికోటి గుండెల్లో నివాసం ఏర్పరచుకోటం గురించి భానుని ఆగమనంతో ఉదయానికి వీడ్కోలు పలికి ఉక్కిరి బిక్కిరి పనులతో పరుగులు పెట్టటం గురించి సాయం సంధ్య అలవోకగా బంగారు కాంతులతో రాత్రి కి స్వాగతం పలకటం గురించి రాయలని ఉంది
  • Hemasri Chava

No comments: